Ponniyin Selvan: ఐదు పదుల వయస్సులోనూ అందాల రాక్షసి.. ఐష్ లుక్‌పై నెటిజన్లు ఫిదా..

48ఏళ్ల వయసులో... సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్స్ ఎలా ఉంటారు.. ఎంతైనా కాస్త ముడతలుపడిన చర్మంతో.. రంగు నెరసిన జట్టుతో..

Ponniyin Selvan: ఐదు పదుల వయస్సులోనూ అందాల రాక్షసి.. ఐష్ లుక్‌పై నెటిజన్లు ఫిదా..

Updated on: Jul 07, 2022 | 7:53 PM

48ఏళ్ల వయసులో… సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్స్ ఎలా ఉంటారు.. ఎంతైనా కాస్త ముడతలుపడిన చర్మంతో.. రంగు నెరసిన జట్టుతో.. కాస్త లావుగా.. గ్లామర్‌ లెస్‌గా ఉంటారు. అప్‌కోర్స్ అందగా ఉన్న వారు కూడా కొంతమంది ఉంటారు లెండి. కాని వారిని వదిలిపెడితే.. పైన చెప్పిన మూడు లైన్లకు కాస్త భిన్నంగా.., కామన్ బాషలో కత్తిలా.. ఫ్యాన్సీ బాషల్లో మెస్మరైజింగా ఉన్నారు ఒకప్పటి మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్‌. ఇది నేనంటున్న మాట… ఐష్ ఫ్యాన్స్ నెట్టింట.. అరిచి గీపెట్టి మరీ చెబతున్న మాట. తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్‌తో క్రేజీయెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం.. తాజాగా పొన్నియన్ సెల్వన్‌ అనే హిస్టారికల్ ఫిక్షన్ నావెల్‌ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో… చాలా మంది ప్టార్ కాస్ట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. సెప్టెంబర్ 30 వరల్డ్ వైడ్ రిలీజ్‌ చేసుందుకు రెడీ కూడా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై బజ్‌ పెంచేందుకు… సినిమాల్లో నటించిన వారి ఫస్ట్ లుక్‌ ను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తున్నారు మణిరత్నం. కాని కొన్ని రోజుల క్రితం రిలీజ్‌ చేసిన ఐశ్వర్య ఫస్ట్ లుక్‌పైనే అతుక్కుపోయారు నెటిజెన్లందరూ. అతుక్కుపోవడే కాదు..వారికి తోచిన ప్రొసలతో.. ఐష్‌ అందాన్ని పొగుడుతున్నారు.

విశ్వసుందరి నయనరూపాన్ని అదేపనిగా చూస్తున్నామని.. కలువల్లాంటి ఆమె కళ్ల సోయగం నుంచి తప్పించుకోలేకపోతున్నామని.. నల్లని విరబూరినట్లున్న కురులు తమని కలిచివేస్తున్నాయని విపరీత కామెంట్లు చేస్తున్నారు. ఐష్ జపం చేస్తూ.. అల్లాడిపోతున్నారు. ‘పడిపోయా.. పిడిపోయా’ సాంగ్ యాడ్‌ చేసి.. ఈ బ్యూటీ పిక్‌ తో రీల్ చేస్తున్నారు. 49ఏళ్ల వయసులో ఇంతందమా అంటూ.. ఆ పిక్ కు కోట్‌ చేస్తున్నారు.