Aishwarya Lekshmi: అతడు నన్ను అసభ్యకరంగా తాకాడు.. షాకింగ్ విషయం చెప్పిన ఐశ్వర్య

ఈ అమ్మడు మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు చేసిన ఒకే ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా చేసింది.

Aishwarya Lekshmi: అతడు నన్ను అసభ్యకరంగా తాకాడు.. షాకింగ్ విషయం చెప్పిన ఐశ్వర్య
Aishwarya Lekshmi

Updated on: Dec 06, 2022 | 6:24 PM

రీసెంట్ గా రిలీజ్ అయినా మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఈ అమ్మడు మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. ఇక ఈ అమ్మడు చేసిన ఒకే ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా చేసింది. అదే గాడ్సే. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఈ అమ్మడు అందంతో నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అమ్ము అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేసింది.

తనజీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఐశ్వర్య.. చిన్న తనంలో కేరళలోని గురువాయిర్ ఆలయానికి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకుడు తనను అసభ్యకరంగా తాగాడని.. ప్రయివేట్  పార్ట్స్ ను టచ్ చేశాడని తెలిపింది. ఆ సమయంలో తాను పసుపు రంగు దుస్తులు ధరించారని నాకు ఇప్పటికి గుర్తుదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆ సంఘటన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలంటే భయమేసింది తెలిపింది ఐశ్వర్య లక్ష్మీ. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన గార్గి సినిమాలో చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగులోనూ అవకాశాలు అందుకుంటోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.