Ponniyin Selvan: ఆ రికార్డ్ సృష్టించిన ఫస్ట్ సినిమా పొన్నియిన్ సెల్వన్.. అక్కడ ఏకంగా రూ. 200 కోట్లు దాటేసింది..

|

Oct 17, 2022 | 9:17 PM

ట్రేడ్ నివేదికల ప్రకారం.. పొన్నియిన్ సెల్వన్ సినిమా దేశవ్యాప్తంగా.. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో రజనీకాంత్ నటించిన 2.0 రికార్డ్ కు కాస్త దూరంలో ఉంది. మరోవైపు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్ జోరు కొనసాగుతుంది.

Ponniyin Selvan: ఆ రికార్డ్ సృష్టించిన ఫస్ట్ సినిమా పొన్నియిన్ సెల్వన్.. అక్కడ ఏకంగా రూ. 200 కోట్లు దాటేసింది..
Ponniyin Selvan
Follow us on

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ తారాగణంతో రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 500-కోట్ల దిశగా పయనిస్తోంది. ఇక ఈ సినిమా 17 రోజులు పూర్తి కాగా.. తమిళనాడులో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. అక్కడ ఈ రికార్డ్ సృష్టించిన మొదటి సినిమా పొన్నియిన్ సెల్వన్ కావడం విశేషం. ట్రేడ్ నివేదికల ప్రకారం.. పొన్నియిన్ సెల్వన్ సినిమా దేశవ్యాప్తంగా.. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో రజనీకాంత్ నటించిన 2.0 రికార్డ్ కు కాస్త దూరంలో ఉంది. మరోవైపు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్ జోరు కొనసాగుతుంది.

సెప్టెంబర్ 30న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా తమిళనాడులో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇందులో తమిళ్ స్టార్ చియాన్ విక్రమ్.. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి ప్రధాన పాత్రలలో నటించగా… ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్షఅమి, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. మొత్తం ఐదు భాగాలుగా ఉన్న ఈ నవలను.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సత్తా చాటుతుండగా.. త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.