సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు.. పోలీసుల వార్నింగ్

|

Dec 25, 2024 | 12:43 PM

డిసెంబర్ 4న పుష్ప2 ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోని అని.. పేర్కొంటున్నారు పోలీసులు.. ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్ బౌన్సర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు పోలీసులు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు.. పోలీసుల వార్నింగ్
Sandhya Theatre
Follow us on

సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు  కీలక ప్రకటన విడుదల చేశారు. పోలీస్‌ శాఖను బద్నాం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. తొక్కిసలాట ఘటనపై కొందరు ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు..  అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. – ఇప్పటికే దీనిపై విచారణ సందర్భంగా నిజానిజాలన్నీ ప్రజల ముందు ఉంచామని సిటీ పోలీస్‌ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవు మీ దగ్గర ఆధారాలుంటే ఇవ్వండి.. సొంత వ్యాఖ్యానాలు వద్దు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వకంగా.. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని అన్నారు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్

. పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జు సంధ్య థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనలో పోలీసులు థియేటర్ యాజమాన్యం పై అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి