Tollywood: అబ్బా.. ఏంటి మేడమ్ మీరు… అప్పటికంటే మరింత హాట్‌గా..

పోకిరి మూవీలో బోల్డ్ రోల్ చేసిన ఈ నటీమణి గుర్తుందా..? తనను ఎలా మర్చిపోతారులేండి. అయితే అంత మంచి పాత్ర చేసినప్పటికి ఈమెకు తర్వాతికాలంలో పెద్దగా అవకాశాలు రాలేదు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. అయితే తన లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం కంగుతింటారు.

Tollywood: అబ్బా.. ఏంటి మేడమ్ మీరు... అప్పటికంటే మరింత హాట్‌గా..
Sheeva Rana

Updated on: Apr 23, 2025 | 7:33 PM

మహేశ్ కెరీర్‌ను పోకిరి సినిమా ముందు.. తర్వాత అని చెప్పవచ్చు. అంతలా అద్దిరిపోయే ఇంపాక్ట్ ఇచ్చింది ఆ చిత్రం. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని తుడిచిపెట్టేసి.. కొత్త చరిత్ర లిఖించింది. ఈ సినిమాలో బాబు యాక్టింగ్, లుక్స్.. అభిమానులకు కొత్త థ్రిల్ అందించాయి. ఇక పూరి జగన్నాథ్ డిఫరెంట్ స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి.. తన సత్తా చూపించారు. ఇక ఈ సినిమాలో అన్ని పాత్రలకు మస్త్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన జ్యోతి రానా అందరికీ గుర్తు ఉంటుంది. ఆమె పేరు మీకు తెలియకపోవచ్చులే కానీ.. విలన్ గ్యాంగ్‌లో.. హీరో వైపు మత్తుగా చూసే యువతిగా కనిపించి మెప్పించింది ఈమె.  విలన్ ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్‌గా.. అతని మాఫియా గ్యాంగ్ ను లీడ్ చేసే లేడీ విలన్ తను అదరగొట్టింది.  గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు అంటూ మూవీలో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ ఈమె గురించే.

ఈ సినిమా నటించిన అందరూ ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి పాత్రలు దక్కించుకున్నారు. కానీ సూపర్ రోల్ చేసినా జ్యోతి రానా ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా మెప్పించలేకపోయింది. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్. ప్రస్తుతం యోగా క్లాసులు చెప్తూ.. తనకు నచ్చిన లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక పోకిరి సినిమాలో ఎంత గ్లామర్‌గా ఉందో.. 42 ఏళ్ల వయస్సులో ఇప్పుడు కూడా అంతే వయ్యారాలతో అదరగొడుతుంది. యోగా మిమ్మిల్ని మెంటల్‌గా, ఫిజికల్‌గా అందంగా ఉంచుందని అని ఈమెను చూసి చెప్పవచ్చు.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా తెలుసుకోవడానికి చాలామంది వెతుకున్నారు. దీంతో లేటెస్ట్‌ ఫోటోలు మీ ముందుకు తెచ్చాం. వన్నె తగ్గని అందంతో.. మత్తెక్కించే ఫోటోలు నిత్యం  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈమె గ్లామర్ ఫోటోలపై  మీరూ ఓ లుక్కేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి