RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన మోదీ, పవన్ కళ్యాణ్.. గర్వంగా ఉందంటూ..

Golden Globe Award: అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్ అద్భుతంగా నటించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఇద్దరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన మోదీ, పవన్ కళ్యాణ్.. గర్వంగా ఉందంటూ..
Rrr

Edited By: Rajitha Chanti

Updated on: Jan 11, 2023 | 2:49 PM

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ మల్టీ స్టారర్‌ మూవీగా తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ . దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్ అద్భుతంగా నటించి అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఇద్దరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌తో అదరగొట్టారు ఈ ఇద్దరు హీరోలు. బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది ఆర్ఆర్ఆర్.   బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది మన సినిమా. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో..నాటు నాటు సాంగ్‌ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు..బెస్ట్‌ సాంగ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి..అతిరథ మహారథుల మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో దేశమంతా చిత్రయూనిట్ మీద ప్రశంసలు కురిపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు ఆయన చిత్రయూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. చాలా ప్రత్యేకమైన విజయం అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కు అభినందనలు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్ర బోస్, రాహుల్ సింప్లిగంజ్ మీకు నా అభినందనలు . రాజమౌళి , ఎన్టీఆర్, రామ్ చరణ్ అలాగే చిత్రయూనిట్ మీ విజయం..ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణం. అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు…’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన శ్రీ చంద్రబోస్, ఆలపించిన గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు. ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు శ్రీ రాజమౌళి, చిత్ర కథానాయకులు శ్రీ రాంచరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య అభినందనీయులు అంటూ పవన్ ట్వీట్ చేశారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ పై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..