Sree Leela: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది వయ్యారి భామ శ్రీలీల. మొదటి సినిమాతోనే తన నటనతో చలాకీ తనంతో ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసింది ఈ బ్యూటీ.సినియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కన్నడ లో పలు సినిమాల్లో నటించిన ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఎపిక అయ్యింది శ్రీలీల . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను ఫాలో అవుతుందట శ్రీలీల. అందుకే రెమ్యునరేషన్ పెంచేసిందట ఈ కన్నడ క్యూటీ. రవి తేజ సినిమాతో అమ్మడు మరింత క్లిక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో ఆ తర్వాత చేయబోయే సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. రవితేజ సినిమా తర్వాత చేయబోయే సినిమాలకు దాదాపు 1 కోటి రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుంది ఈ అల్లరి పిల్ల. ఇక శ్రీలీల కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారట. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా.. అలాగే నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తుందట. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :