Sreeleela : టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. రెమ్యునరేష్ కూడా పెంచేసిందట..

| Edited By: Anil kumar poka

Feb 04, 2022 | 8:35 AM

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి

Sreeleela : టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. రెమ్యునరేష్ కూడా పెంచేసిందట..
Sreeleela
Follow us on

Sreeleela : ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది వయ్యారి భామ శ్రీలీల. రాఘవేంద్రరావు సైతం ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. మొదటి సినిమాతోనే తన నటనతో చలాకీ తనంతో ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసింది ఈ బ్యూటీ. రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కన్నడ లో పలు సినిమాల్లో నటించిన ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ అందాల భామ. రవితేజ హీరోగా రూపుదిద్దుకుంటున్న `ధమాకా` సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు . అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్కు సైతం ఈ ముద్దుగుమ్మ సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తన రెమ్యునరేషన్ ను పెంచేసిందని తెలుస్తుంది. రవి తేజ సినిమాతో అమ్మడు మరింత క్లిక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో ఆ తర్వాత చేయబోయే సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. `పెళ్లి సందD`కి రూ. 5 లక్షల కన్నా తక్కువ  రెమ్యునరేషన్ను అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం రూ.1 కోటి వరకు డిమాండ్ చేస్తోందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..