Pawan Kalyan: థియేటర్లలోకి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ‘తొలిప్రేమ’ రీరిలీజ్ ఎప్పుడంటే..

ఇటీవల యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సింహాద్రి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ మళ్లీ రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‏లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న తొలి ప్రేమ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

Pawan Kalyan: థియేటర్లలోకి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. తొలిప్రేమ రీరిలీజ్ ఎప్పుడంటే..
Tholiprema

Updated on: May 24, 2023 | 2:59 PM

ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను 4కే వెర్షన్‏లో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సినిమాలు మళ్లీ విడుదలై భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సింహాద్రి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ మళ్లీ రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‏లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న తొలి ప్రేమ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

తొలిప్రేమ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తికాబోతున్న నేపథ్యంలో జూన్ 30న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా 4K ప్రింట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కరుణాకరణ్ దర్శకత్వం వహించగా.. తెలుగుమ్మాయి కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి దేవా సంగీతం అందించగా.. వాసుకి, అలీ, వేణు మాధవ్, రవిబాబు కీలకపాత్రలలో నటించారు. పవర్ స్టార్ కెరీర్‏లోనే తొలి ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. పవర్ స్టార్ ఇమేజ్ అమాంతం పెంచేసింది. ఇక ఇప్పుడు 4కే వెర్షన్ లో రాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.