జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల..ఓ అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి సందడి చేశారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్లోని చిన్నారులతో కలిసి..క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనాథాశ్రమానికి నిత్యావసర సరకులను అందజేసిన అన్నా కొణిదెలను హోమ్ నిర్వాహకులు సన్మానించారు.
అలాగే అన్నా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అన్నా కొణిదెల గారిని హోమ్ నిర్వాహకులు సత్కరించారు.