
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు హరీష్ శంకర్. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి మూడో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హుక్ స్టెప్పు ఇప్పుడు రచ్చ లేపింది. ఎక్కే, దిగే కిక్కులోన దక్కేదేముందే..అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే..ఎక్కీ తొక్కేటోల్లే ఉంటే తగ్గేదేముందే.. నెగ్గే దాకా తిక్కే ఉండాలే.. అంటూ సాంగ్ ప్రమోను విడుదల చేశారు. ఈ సాంగ్ థియేటర్స్ లో రచ్చ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దేవీ శ్రీ సంగీతం అందించిన ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించారు. కాసర్ల శ్యామ్ రచించారు.
గత ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా హరిహరవీరమల్లు సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మార్చ్ 19 ఉస్తాద్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Volume up…and start dancing 🕺
Etthara Etthara Collar Ey Etthara 💥💥#UstaadBhagatSingh third single #CollarEyEtthara Song promo out now 🕺🔥Full song on March 12th at 5 PM.
A Rockstar @ThisIsDSP Musical
Sung by energetic #RamMiriyala
Lyrics… pic.twitter.com/n6mdXBWWpW— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.