
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో గత కొన్ని నెలలుగా ఆయన సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవలే మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తిరిగి షూటింగులలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేశారు. జూన్ 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత పవన్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ మెగాభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది.
‘ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన ది బెస్ట్ పాత్రను సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ సిద్ధం కండి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చాలా ఏళ్లు గుర్తుండిపోయే చిత్రం. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు అర్థం వచ్చేలా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీన్ని షేర్ చేసిన హరీశ్ శంకర్.. ‘ఇక మొదలెడదాం..’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
Get ready to celebrate the best of POWERSTAR 🔥#UstaadBhagatSingh – Written & directed by @harish2you 🔥
This one will be remembered and celebrated for many years.Shoot begins soon ❤🔥
Happy Hanuman Jayanthi ✨
Stay tuned for more updates!@PawanKalyan @harish2you… pic.twitter.com/i07aXPZAhh
— Mythri Movie Makers (@MythriOfficial) May 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.