Devayani : పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ గుర్తుందా.. ? ఆస్తులు తెలిస్తే షాకే..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ దేవయాని. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్‏గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా బిజీగా ఉంటుంది. దేవయాని పర్సనల్ లైఫ్, సినీప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

Devayani : పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ గుర్తుందా.. ? ఆస్తులు తెలిస్తే షాకే..
Devayani

Updated on: Apr 03, 2025 | 12:31 PM

తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు దేవయాని. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. బెంగాలీ సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన దేవయాని, తొట్టసినుంగి అనే తమిళ సినిమాతో తొలిసారిగా కనిపించింది. అజిత్, ప్రశాంత్, విజయ్ దళపిత వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ చిత్రాలు చేసింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగంత చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కథానాయికగా కాకుండా సహయ నటిగా కనిపించింది.

దేవయాని 90’sలో కుర్రాళ్ల కలల రాణి. అద్భుతమైన నటనకుగానూ నటిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకుంది. ఇప్పుడు సహయ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది దేవయాని. ఇదిలా ఉంటే.. అటు సినిమాలు.. ఇటు సీరియల్స్ ద్వారా చాలా బిజీగా ఉంటున్న దేవయాని.. ఇప్పటివరకు రూ.15 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆమెకు చెన్నైలో సొంత ఇల్లు కూడా ఉంది. అలాగే ఆమె స్వస్థలమైన ఈరోడ్‌లోని అంత్యుయూర్‌లో ఒక ఫామ్‌హౌస్‌ను కలిగి ఉంది.

దేవయాని వ్దద బెంజ్, స్కోడా వంటి కార్లు ఉన్నాయి. రాజరిక జీవితాన్ని గడిపే నటీమణులలో దేవయాని ఒకరు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఇనియా, ప్రియాంక. అలాగే రెండు ఎకరాల పొలంలో ఉన్న విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో 5 బెడ్ రూమ్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..