Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. వకీల్ సాబ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్‌గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హరి హర వీరమల్లు అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా మొగలాయిలా నాటి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతోపాటు భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా నటిస్తున్నాడు. నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీనుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక తాజాగా పవన్ నటిస్తున్న మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో సురేందర్ రెడ్డి సినిమా కూడా ఒకటి. రీసెంట్‌గా మెగాస్టార్ నటించిన సైరా సినిమాతో మెగా అభిమానులను ఆకట్టుకున్న సురేందర్ రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ సినిమానుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ కాంబినేషన్ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘యథా కాలమ్.. తథా వ్యవహారమ్” అంటూ సంస్కృతంలోని లైన్స్‌తో పవన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని బ్యాక్ గ్రౌండ్‌లో చూపిస్తూనే పైన ఓ గన్‌ను చూపించారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. రామ్ తాళ్లూరి ఈ మూవీని నిర్మించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :