
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 01) హైదరాబాద్ వేదికగా ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , నిర్మాత దానయ్య పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే చిత్రంలో నటించిన యాక్టర్లు, టెక్నీషియన్లకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇదే సందర్భంగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ లో తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. సుజిత్ టేకింగ్ తనకు బాగా నచ్చిందని, అతని కోసమే ఓజీ యూనివర్స్ లో భాగమవుతానని పేర్కొన్నారు. అయితే తన రాజకీయ జీవితం కారణంగా తన రాబోయే సినిమాలు కొన్ని కండిషన్లు, నిబంధనలకు లోబడి ఉంటుందని డైరెక్టర్ సుజిత్ తో చెప్పుకొచ్చారు పవన్. ఇంకా ఈ వేదికలో పవన్ కల్యాణ్ ఏమేం మాట్లాడారో ఈ కింది వీడియోలో చూడండి..