Bro Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న బ్రో.. నయా రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ

|

Aug 29, 2023 | 8:22 AM

తమిళ్ లో వినోదయ సిత్తం అనే సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించడంతో బ్రో సినిమా పై విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో థియేటర్స్ లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఆగస్టు 25 నుంచి బ్రో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో బ్రో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Bro Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న బ్రో.. నయా రికార్డ్ క్రియేట్ చేసిన మూవీ
Bro
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. దర్శకుడు, రచయిత, నటుడు అయిన సముద్రఖని బ్రో సినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో వినోదయ సిత్తం అనే సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించడంతో బ్రో సినిమా పై విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దాంతో థియేటర్స్ లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఆగస్టు 25 నుంచి బ్రో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో బ్రో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా బ్రో మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా చూస్తున్నారు. దాంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్ గా ఈ సినిమా నంబర్ వన్ స్థానంలోనిలిచింది.

ఓటీటీలో బ్రో సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేయడంతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. బ్రో సినిమా ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఆయన వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో ఓజీ అనే సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమానుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.