Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Bheemla Nayak: టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్
Bheemla Nayak

Updated on: Dec 17, 2021 | 12:16 PM

Bheemla Nayak: టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ మేరకు ఇప్పటికే  చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా కొత్త షెడ్యూల్ ను ఈరోజు ఉదయం వికారాబాద్‌లోని మదన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కి కూడా పాత్ర ఉండడంతో షూటింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. ఈ విషయం తెలియగానే.. స్తానికులు పవన్ కళ్యాణ్ ను చూడడానికి భారీగా లొకేషన్ కు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ సాప్ట్ కు చేరుకొని పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కారు నుంచి కారులో నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు కనువిందు చేశారు.

పవన్‌కల్యాణ్‌ పోలీస్ ఆఫీసర్ గా రానా డానియల్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. నిత్యామేనన్‌, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలను అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సహా రిలీజైన అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:  మామిడి చెట్టుమీద మూడు అంతస్థుల భవనం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ట్రీహౌస్‌కు చోటు..