OG Movie: ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? పవన్ కల్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్.. ఎప్పటినుంచంటే?

ఏపీ డెప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

OG Movie: ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? పవన్ కల్యాణ్ ఓజీ అడ్వాన్స్ బుకింగ్.. ఎప్పటినుంచంటే?
Pawan Kalyan OG Movie

Updated on: Aug 24, 2025 | 6:35 PM

హరి హర వీరమల్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ఓజీ. పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైన్ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాసేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ కూడా వచ్చింది. వినాయకచవితి పండగ ఆగస్టు 27 న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు OG సినిమా నుంచి రెండో సాంగ్ మెలోడీ సువ్వి సువ్వి ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక స్పెషల్ కలర్ ఫుల్ ఫోటో కూడా రిలీజ్ చేసారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కలిసి నీటిలో దీపం వదులుతూ చూడముచ్చటగా కనిపించారు.

కాగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ‘ఓజీ’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడది అబద్దమని తేలిపోయింది. ఎందుకంటే మూవీ రిలీజ్ డేట్ కంటే నాలుగు వారాల ముందు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆగస్టు 29వ తేదీ నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 24న ప్రీమియర్లతో ఓజీ సినిమా షోస్ స్టార్ట్ కానున్నాయి. అంటే పవన్ సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకాలు లేనట్టే.

ఇవి కూడా చదవండి

మరో ఐదు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ షురూ..

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద దానయ్యతో పాటు ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ ఈ ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.