
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం (ఆగస్టు 30) కన్నుమూశారు. దీంతో మెగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అన్ని పనులు చూసుకున్నారు. పాడె కూడా మోసి అత్తమ్మకు తుది వీడ్కోలు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ నిన్న వైజాగ్ లో ఉన్నారు. జనసేన బహిరంగ సభ ఉండటంతో అది అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు కనకరత్నమ్మ ఫొటోకు నివాళులు అర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ లను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
అంతకు ముందు సోషల్ మీడియా వేదికగా అల్లు కనకరత్నమ్మకు నివాళి అర్పించారు పవన్ కల్యాణ్.. ‘ శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. శ్రీమతి కనకరత్నమ్మ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
Our Deputy CM @PawanKalyan Garu Personal Condolences To Demise Of #AlluKanakaratnamma Garu At #AlluAravind Residence 👈❣️🙏#Pawanakalyan #AlluArjun pic.twitter.com/vweiqDA5O9
— Madhu B (@AlwaysMadhu98) August 31, 2025
శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.