Pawan Kalyan: మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్.. నా బెస్ట్ ఇచ్చాను.. పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా హరి హర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో అడియన్స్ ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్.

Pawan Kalyan: మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్.. నా బెస్ట్ ఇచ్చాను.. పవన్ కళ్యాణ్..
Pawan Kalyan Movie

Updated on: Jul 21, 2025 | 12:57 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం హరి హర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 24న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండగా.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పా కళా వేదికలో హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది చిత్రయూనిట్. అంతకు ముందు సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు.

“సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. ఇందుకు చాలా కష్టపడ్డాం అని చెప్పడం నాకు మొహమాటంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఫోటోస్ పేపర్లో వేయలేదు. దీంతో పబ్లిసిటి లేకుండానే సినిమాలు విడుదల అయ్యాయి. సినిమా గురించి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. సినిమాలో నటించడం మాత్రమే తెలుసు.. ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిర్మాత ఏఎం రత్నమే. సినిమాను నిర్మించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేదు. అయినా నా బెస్ట్ ఇచ్చారు. గతంలో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ సినిమాకు చాలా పనికి వచ్చింది. ఈ సినిమాకు క్లైమాక్స్ అనేది ఆయువు పట్టు.

క్రిష్ చాలా మంచి కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. ఆయనకు మా టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు. సినిమా కోసం నిర్మాత ఎంతో నలిగిపోయారు. ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పోశారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేసాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను. ఈ సినిమా క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది. ఈ మూవీ కోసం నిర్మాత ఎదుర్కొన్న కష్టాలు చూసి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా.. నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..