Hari Hara Veera Mallu: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న “హరిహర వీరమల్లు” టీజర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

Hari Hara Veera Mallu: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న హరిహర వీరమల్లు టీజర్..
Hari Hara Veeramallu

Updated on: Oct 11, 2022 | 7:19 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీ ఎంట్రీ తర్వాత పవన్ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమా హరిహర వీర మల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమానుంచి రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ సంచనల్ను సృష్టిస్తోంది.

ఈ టీజర్ విషయానికొస్తే.. ఫస్ట్ గ్లింప్స్ లో మెడల్ని వంచి, కథల్ని మార్చి.. కొలిక్కితెచ్చే పనెట్టుకొని .. తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. విలన్స్‏ను వేటాడుతూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు పవన్.  ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక రోజులోనే `పవర్ గ్లాన్స్` అన్ని భాషలలో కోటి (10+ మిలియన్ల) పైగా వ్యూస్ ను సంపాదించుకొని రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి