
కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా.. అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పడమే కాదు.. మరోసారి హరిహర వీరమల్లు సినిమాతో రుజువు చేశారు. దాదాపు ఐదేళ్ళ పాటు సినిమా షూటింగ్ జరుపుకుంది. మొదట్లో క్రిష్ డైరెక్షన్.. అనుకోని కారణాలతో జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టాల్సి వచ్చింది. ఇక సినిమా షూటింగ్ నత్తనడకన సాగడం.. రిలీజ్ డేట్స్ మారడం వంటి వాటితో పవన్ నటిస్తున్న మిగిలిన సినిమాలకు ఉన్న ఫోకస్ ఈ సినిమాపై అభిమానులు పెట్టలేదు. అయితే పవన్ సినిమా రిలీజ్ కి కేవలం రెండు రోజుల ముందు రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టారు.. అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు అంతే ఒక్కసారిగా హరిహర వీరమల్లు సినిమా బజ్ క్రియేట్ అయింది. అది చూసిన ఎవరైనా ఇదికదా పవన్ కళ్యాణ్ అంటే అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పుడు ‘స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఈ సినిమా నేపధ్యం 16వ శతాబ్దంలో మొఘలు హిందువులను ఎలా ట్రీట్ చేశారు.. ప్రపంచంలోనే అతి విలువైన వజ్రం కోహినూర్ ని ఎత్తుకేల్లిన ఔరంజేబు నుంచి వీరమల్లు ఎలా తిరిగి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు అనేది.
భారత దేశంలో మొఘలుల పాలన మొదలయ్యాక.. హిందువులు ఎన్ని కష్టాలు పడ్డారు? మొఘలు ఎన్ని అరాచకాలు సృష్టించారు? హిందువుల వద్ద పన్నులు వసూలు చేశారు వంటి అనేక అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు సింహాసనంపై ఉన్న ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకుని రావడానికి వీరమల్లు పోరాటం చేస్తుంటాడు. ఈ పనిని నిజం నవాబు కుతుబ్ షాహీ అప్పజెప్పుతాడు. కోహినూర్ వజ్రం తెచ్చేందుకు వీరమల్లు హైదరాబాద్ నుంచి డిల్లీకి చేరుకుంటాడు. అక్కడ వీరమల్లుని అడ్డుకుంటాడు ఔరంగజేబు.
AANDHI AAGAYI…🔥⚔️#HariHaraVeeraMallu is now shaking theatres like a BATTLE TSUNAMI 💥💥https://t.co/kCHTndTFTa
Go… Witness the RAGE 🦅Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 @Manojdft… pic.twitter.com/oPZHVniP2L
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 23, 2025
అయితే మొదటి పార్ట్ లో యుద్ధ భూమి అనే టైటిల్‌తో శుభం కార్డ్ పడింది. వీరమల్లు ఔరంగజేబుల ఆమధ్య జరిగిన అసలైన యుద్ధం చూడాలంటే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందే. మొదటి సినిమా
క్లైమాక్స్‌లో అంచనాలు పెంచి హరిహరవీర మల్లు రెండో భాగం టైటిల్‌ను హరి హర వీర మల్లు: పార్ట్ 2 – యుద్ధభూమి అని రివీల్ చేశారు. ఈ సీక్వెల్ లో కోహినూర్ వెనక్కు తీసుకొచ్చే సమయంలో వీరమల్లు, ఔరంగజేబుతో పోరాటాలు, యాక్షన్ సీన్స్ చూపించనున్నారు.
ఐదేళ్ల కిందట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా అనుకోని కారణాలతో క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వం చేశారు. హీరోయిన్గా నిధి అగర్వాల్, జౌరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు. ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించారు. ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు. కాగా ప్రసుత్తం థియేటర్లలో పవర్ స్టార్ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఉన్న బజ్ చూస్తే హరిహర వీరమల్లు వసూళ్ళు భారీ స్థాయిలోనే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..