Vani Viswanath :నగరి పాలిటిక్స్‌కు సినిమా గ్లామర్.. వాణి విశ్వనాథ్‌ను ఆహ్వానిస్తూ జనసైనికుల హంగామా

నగరి పాలిటిక్స్‌కు సినిమా గ్లామర్.! వచ్చే ఎన్నికల్లో సీన్ రోజా వర్సెస్ వాణి విశ్వనాథ్‌గా మారనుందా అంటే ప్రస్తుతానికైతే అవుననే సమాధానం వస్తోంది.

Vani Viswanath :నగరి పాలిటిక్స్‌కు సినిమా గ్లామర్.. వాణి విశ్వనాథ్‌ను ఆహ్వానిస్తూ జనసైనికుల హంగామా
Vani Vishwanath

Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2022 | 5:55 PM

Vani Viswanath : నగరి పాలిటిక్స్‌కు సినిమా గ్లామర్.! వచ్చే ఎన్నికల్లో సీన్ రోజా వర్సెస్ వాణి విశ్వనాథ్‌గా మారనుందా అంటే ప్రస్తుతానికైతే అవుననే సమాధానం వస్తోంది. నగరి నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు వాణి విశ్వనాథ్. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు. అయితే వాణి విశ్వనాథ్ కు టీడీపీ నుంచి కూడా టికెట్‌ వచ్చే ఛాన్స్ లేదు. సో ఆమె బీజేపీ లేదా జనసేన వైపు అడుగులు వేయొచ్చన్న టాక్‌ జోరుగా నడుస్తోంది. ఈ ఇష్యూపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకముందే పుత్తూరులో జనసైనికులు హంగామా చేయడం ఆసక్తికరంగా మారింది..

జనసేనలో చేరి.. నగరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలంటూ బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాణి విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెబుతున్నారు. నగరి నుంచి బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టారు వాణి విశ్వనాథ్. రెండు వారాల క్రితం నగరి వచ్చిన ఆమె..తమిళ,తెలుగు సినిమా రంగంతో పరిచయం ఉన్నవారిని కలిసింది. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు చేసి..ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. నర్సుగా తన అమ్మమ్మ నగరిలోనే పనిచేశారని చెబుతోంది వాణీ విశ్వనాథ్‌ . ఆ అనుబంధంతో తానూ నగరి ప్రజలకు మరింత దగ్గరవుతానని తెలిపింది.

నైంటీస్‌లో తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాలని గట్టిగానే డిసైడ్ అయింది.. 2019 ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ఆ పార్టీలో చేరాలనుకుంది. మూడు సార్లు అమరావతికి కూడా వెళ్లినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. ఈసారి ఏ పార్టీ నుంచి అవకాశం లేకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగాలని భావిస్తోన్నారట. అయితే జనసైనికులు ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పుడు నగరి పాలిటిక్స్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..