Pawan Kalyan: ‘సీజ్‌ ది షిప్‌’.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ

|

Dec 04, 2024 | 5:20 PM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చెప్పిన సీజ్‌ ది షిప్‌ అనే డైలాగ్‌ ఎంతలా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాలకు అక్రమంగా తరిస్తున్న ఓ షిప్‌ను అడ్డుకున్న సమయంలో పవన్‌ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది..

Pawan Kalyan: సీజ్‌ ది షిప్‌.. టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
Pawan Kalyan
Follow us on

పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు పవర్‌ స్టార్‌. పవన్‌ చేయి అలా పైకెత్తినా ఆయన మేనరిజానికి ఫిదా అవుతుంటారు. సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు. ఇక పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాకినాడ పోర్ట్‌లో పవన్‌ చేసిన హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పనామా దేశానికి చెందిన అక్రమంగా విదేశాల‌కు త‌ర‌లి వెళుతున్న రేషన్ బియ్యంను ప‌ట్టుకుని సీజ్ చేసిన‌ట్లు వార్త‌లు వచ్చిన విషయం తెలిసిందే. షిప్‌లో బియ్యం తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్‌.. చిన్న బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. అక్కడ అధికారులతో మాట్లడుతూ.. ‘సీజన్‌ ద షిప్‌’ అనే పవన్‌ చెప్పిన మాట నెట్టింట తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఈ డైలగ్‌ను ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్ చేశారు. ‘సీజ్‌ ది షిప్‌’ అని పవన్‌ చెప్పిన డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఏకంగా ఈ డైలాగ్‌ పేరుతో ఓ టైటిల్‌ను కూడా రిజిస్టర్‌ చేసేశారు. టాలీవుడ్‌కు చందిన ఆర్‌ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ తాజాగా ‘సీజ్‌ ది షిప్‌’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసుకున్నారు ఈ టైటిల్‌ను రూ. 1,100కు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఏడాది కాలానికి గాను ఈ టైటిల్‌ హక్కులను సంపాదించుకున్నారు. మరి ఈ సినిమాలో పవన్‌ నటిస్తారా.? అసలు ఇది సినిమాగా టర్న్‌ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..