Nagababu: నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. అరుదైన వీడియోతో డిఫెరెంట్‌గా పవన్‌కు బర్త్ ‌డే విషెస్

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలను ఆయన ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు అట్టహాసంగా జరుపుకున్నారు.

Nagababu: నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. అరుదైన వీడియోతో డిఫెరెంట్‌గా పవన్‌కు బర్త్ ‌డే విషెస్
Nagababu

Updated on: Sep 02, 2021 | 7:05 PM

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలను ఆయన ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు అట్టహాసంగా జరుపుకున్నారు. నాగబాబు తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు కాస్త డిఫెరెంట్‌గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ అరుదైన ఫోటోలతో కూడిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో నెటిజన్స్ వీక్షించారు. ఈ వీడియోతో పాటు పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు నాగబాబు.

అణగారిని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని పరితపిస్తూ నీలో రగిలే నిప్పు కణికకు తాను అభిమానిగా నాగబాబు పేర్కొన్నారు. ఆ నిప్పు కణిక నేడు ఓ అగ్ని జ్వాలగా మారి జన సైనికులకందరికీ వ్యాపించడం చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మెరుగైన సమాజం, ప్రజల బంగారు భవిత కోసం జన సైనికులు చేస్తున్న పోరాటం అమోఘమని కితాబిచ్చారు.

నాగబాబు ఇన్‌స్టా పోస్ట్..

పవన్ కల్యాణ్‌కు నిహారిక విషెస్..

అటు తన బాబాయ్ పవన్ కల్యాణ్‌కు  బర్త్ డే విషెస్ తెలియజేస్తూ నిహారిక ఇన్‌స్టాలో స్పెషల్ పోస్ట్ చేశారు.

Also Read..

Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Funny Video: స్నేహం అంటే మనదేరా అంటున్న కోతి- మేక.. నవ్వులు పూయిస్తున్న వీడియో..