Pawan Kalyan : సంక్రాంతి బరిలో పవర్ స్టార్… కసిగా కలబడనున్న పవన్ -రానా

|

Jun 28, 2021 | 11:50 AM

"కొన్ని సార్లు రావడం లేటవ్వొచ్చేమో కాని.. రావడం మాత్రం పక్కా" అంటున్నారు పవన్ కళ్యాణ్ . పైగా  రావడానికి అలాంటిలాంటి రోజు కాదు మంచి.. పండగ రోజునే పక్కాగా సెలక్ట్‌..

Pawan Kalyan : సంక్రాంతి బరిలో పవర్ స్టార్... కసిగా కలబడనున్న పవన్ -రానా
Pawan Kalyan
Follow us on

pawan kalyan: “కొన్ని సార్లు రావడం లేటవ్వొచ్చేమో కాని.. రావడం మాత్రం పక్కా” అంటున్నారు పవన్ కళ్యాణ్ . పైగా  రావడానికి అలాంటిలాంటి రోజు కాదు మంచి.. పండగ రోజునే పక్కాగా సెలక్ట్‌ కూడా చేసుకున్నారు. కోడి పందాలు ఓ వైపు…కసిగా కలబడే పవన్‌ రానా మరో వైపు. సందడి ఓ వైపు.. సవాలు విసురుతూ డైలాగులు చెప్పే పవన్‌ మరో వైపు..!  కలెక్షన్‌ల సునామి.. స్ట్రెయిట్గా టాలీవుడ్‌నే ముంచెత్తినట్టు ఉంటుంది కదూ.. మరో రికార్డు, రిమైనింగ్ హీరోలకు టార్గెట్గా మారుతుంది కదూ! . ఈసారి సంక్రాంతి సందడి ఇలానే ఉండబోతుంది..అవును.. పవన్‌ సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. 2022 సంక్రాతి డేట్‌ను ఎంగేజ్‌ చేయడానికి ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నారు. వకీల్ సాబ్‌ సినిమా తరువాత దూకుడు మీదున్న పవన్‌.. ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్‌ను సాగర్‌ చంద్ర డైరెక్షన్‌లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టే పవన్‌ కల్యాణ్, రానా షూట్లో కష్టపడుతూ.. వచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమా కోసం రాసిన డైలాగులను ఫుల్లీ ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయట. కానీ కరోనా షూటింగ్ ఆగిపోవడంతో ఇంతకాలం ఇంటికే పరిమితం అయ్యారు.

అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని ఈ మూవీ మేకర్స్‌ రీసెంట్‌గా కాస్త గట్టిగా ఫిక్స్‌ అయ్యారట. అందుకు గాను తాజాగా ఓ ప్లాన్‌ ఆఫ్ యాక్షన్ను ప్రిపేర్ చేశారట. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయబోయే షూట్ దగ్గరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల వరకు ఆ ప్లాన్‌ ఆఫ్ యాక్షన్లో మెన్షన్ చేశారట ఏకే మూవీ మేకర్స్‌. అయితే ఈ మూవీలో పవన్‌ రానా సరసన నటించే నాయికలెవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిన్నమొన్నటి వరకు సాయిపల్లవి, నిత్యామీనన్‌, సమంత, ఐశ్యర్య పేర్లు వినిపించినప్పటికీ… ఎవరు పక్కా నటిస్తున్నార్న ఇన్‌ఫోం.. అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..

Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ.. మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌..

వర్మ కు వచ్చిన అతి పెద్ద డౌట్.. పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి .