Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మిలియన్ కొద్ది వ్యూస్ దక్కించుకుంటూ.. దూసుకుపోతున్నాయి. అలాగే భీమ్లానాయక్ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. టైటిల్ సాంగ్‌తోపాటు అందమైన మెలోడీని రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు కూడా రికార్డ్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో పవన్ -రానా మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయని తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమానుంచి ఓ ఫోటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. షూటింగ్ బ్రేక్ సమయంలో పవన్ కళ్యాణ్, రానా రిలాక్స్ అవుతున్న ఫోటోను వదిలారు. ఈ ఫొటోలో పవర్ నులక మంచం పై పడుకొని ఉండగా.. రానా పక్కనే ఉన్న ఎడ్ల బండి పై పడుకొని రిలాక్స్ అవుతున్నాడు. ఈ ఫొటోలో బ్యాగ్రౌండ్లో కొన్ని బొమ్మల షాపులు కనిపిస్తున్నాయి. అలాగే పవన్ -రానా బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి. చూస్తుంటే ఎదో ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని అర్ధమవుతుంది. ఇప్పుడు ఈఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Bheemla Nayakమరిన్ని ఇక్కడ చదవండి :