Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..

|

Nov 13, 2021 | 9:52 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.

Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్.. మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాతోపాటు.. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవే కాకుండా.. పవర్ స్టార్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారట చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి పవర్ స్టార్‏కు స్టోరీ కూడా వినిపించినట్లుగా తెలుస్తోంది. అయితే కథ విషయంలో అనిల్ రావిపూడికి పవన్ ఓ కండిషన్ పెట్టినట్లుగా టాక్. హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చే స్క్రీప్ట్‏తో రావద్దని.. ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి తరహాలో స్క్రిప్ట్ ఉండాలని కోరినట్లుగా టాక్. యూత్ ఎంజాయ్ చేసేలా మాస్ సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఆసక్తికరమైన కామెడీ సినిమా చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే రెడి చేసిన స్క్రిప్ట్‏లో మార్పులు చేయాలని సూచించినట్లుగా సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఇందులో వెంకటేష్.. వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా.. తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ఇంట్లో రచ్చ రచ్చ.. సన్నీని రెచ్చగొట్టిన సిరి, షణ్ముఖ్..

RRR Movie: నాటు నాటు పాట మీద రచ్చ రచ్చ.. జక్కన్నా వినిపిస్తోందా?