AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్షోభ స‌మ‌యంలో సినిమా షూటింగులపై ప‌వ‌న్ మ‌న‌సులో మాట‌..

రాజకీయాల్లో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..కొంత‌కాలం సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఇటీవ‌ల ఆయ‌న వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు బిజీ షెడ్యూల్స్ లో తీరిక లేకుండా షూటింగ్ చేశారు.

సంక్షోభ స‌మ‌యంలో సినిమా షూటింగులపై ప‌వ‌న్ మ‌న‌సులో మాట‌..
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2020 | 4:34 PM

Share

Pawan Kalyan : రాజకీయాల్లో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..కొంత‌కాలం సినిమా ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా ఇటీవ‌ల ఆయ‌న వ‌ర‌స సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పాటు బిజీ షెడ్యూల్స్ లో తీరిక లేకుండా షూటింగ్ చేశారు. కానీ ఊహించ‌ని విధంగా క‌రోనా మ‌హ‌మ్మారి వీర‌విహారం చేయ‌డంతో చిత్రీక‌ర‌ణ‌ల‌కు బ్రేక్ ప‌డింది. తాజాగా పవన్ కల్యాణ్ త‌న‌ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్ర‌స్తుతం షూటింగ్ చేసే పరిస్థితులు లేవని, సినిమాల షూటింగులకు కరోనా వైరస్ ఆటంకంగా ఉందని పేర్కొన్నారు. ఎవరికి వైర‌స్ సోకినా సమస్యే అని వ్యాఖ్యానించారు.

ప్ర‌జంట్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు ప‌వ‌న్. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పవన్ కల్యాణ్ సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ… ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. ఈ విష‌యంపై ఇటీవ‌ల‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన‌ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రశ్న: మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా?

ప‌వ‌న్ స‌మాధానం: కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.

ఇది కూడా చ‌ద‌వండి : సినిమా పుట్టిన నాలుగేళ్లకే కైకాల జ‌న‌నం.. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో చెర‌గ‌ని ముద్ర‌..

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్