ఇప్పటికి ఏడుగురు పోయారు, నెక్ట్ నువ్వే : వర్మకు వార్నింగ్

|

Dec 17, 2019 | 8:10 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా వర్మ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌ల ఫాలోవర్స్‌కి టార్గెట్ అయ్యారు. టీడీపీ వాళ్లు కోర్టులో కేసులో వేసి వదిలేశారు. పవన్ ఫ్యాన్స్.. వర్మ శ్రద్ధాంజలి పోస్టర్లు పెట్టి రోడ్డుపై నిరసనకు దిగారు. ఇక ఎవర్ గ్రీన్ కేఏ పాల్ అయితే ఏకంగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో […]

ఇప్పటికి ఏడుగురు పోయారు, నెక్ట్ నువ్వే : వర్మకు వార్నింగ్
Follow us on

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా వర్మ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌ల ఫాలోవర్స్‌కి టార్గెట్ అయ్యారు. టీడీపీ వాళ్లు కోర్టులో కేసులో వేసి వదిలేశారు. పవన్ ఫ్యాన్స్.. వర్మ శ్రద్ధాంజలి పోస్టర్లు పెట్టి రోడ్డుపై నిరసనకు దిగారు. ఇక ఎవర్ గ్రీన్ కేఏ పాల్ అయితే ఏకంగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అమెరికాలో ఉన్న ఆయన సెల్ఫీ వీడియోల ద్వారా వర్మపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాను కోర్టుకు వెళ్లడం వల్లనే చిత్రం టైటిల్ మార్చడంతో పాటు చాలా సీన్లు తొలగించారని పాల్ పేర్కొన్నాడు. సినిమా విడుదల విషయంలో నైతిక విజయం తనదే అన్న కేఏ పాల్..వర్మ ఖాతాలో మరో చెత్త సినిమా వేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. క్రిస్మస్ నెలలో తన టైమ్ వేస్ట్ చెయ్యడానికి వర్మ ట్రై చేస్తున్నాడని..అతని ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాల్. వరల్డ్ మొత్తంలో తనతో, జీసస్‌తో పెట్టుకున్నవాళ్లు ఏడుగురు అడ్రస్ లేకుండా పోయారని, వర్మ త్వరలోనే ఆ కేటగిరీలో చేరుతారంటూ హెచ్చరించారు.