“మేము జ‌స్ట్ ‘ఎంటర్​టైనర్స్’..వారే అస‌లైన హీరోలు”

భారత సైనికులు, పోలీసుల‌ను అస‌లైన హీరోలుగా అభివ‌ర్ణించారు ప్ర‌ముఖ న‌టుడు పరేశ్ రావల్. ఫిల్మ్స్ లో న‌టించే తామంతా జ‌స్ట్ 'ఎంటర్​టైనర్స్' మాత్రమేనని పేర్కొన్నారు.

మేము జ‌స్ట్ 'ఎంటర్​టైనర్స్'..వారే అస‌లైన హీరోలు
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 3:31 PM

భారత సైనికులు, పోలీసుల‌ను అస‌లైన హీరోలుగా అభివ‌ర్ణించారు ప్ర‌ముఖ న‌టుడు పరేశ్ రావల్. ఫిల్మ్స్ లో న‌టించే తామంతా జ‌స్ట్ ‘ఎంటర్​టైనర్స్’ మాత్రమేనని పేర్కొన్నారు. నిజ‌మైన హీరోలు ఎవ‌రో ముందు త‌రాలు తెలుసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆర్మీ, పోలీసుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న చేసిన ట్వీట్ కు నెటిజ‌న్ల నుంచి ఊహించ‌ని రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇటీవలే చైనాతో జరిగిన బార్డ‌ర్ వివాదంలో 20 మంది భారత జవానులు అమ‌రులైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పరేశ్ రావల్ సదరు ట్వీట్ చేశారు. పలు భాష‌ల్లో మూవీస్ చేస్తూ న‌టుడిగా బిజీగా ఉన్న పరేశ్ రావల్.. ప్రజంట్ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.