లాక్ డౌన్ కారణంగా రెండో సారి షట్‌డౌన్ అయిన ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అవుతోంది. దీంతో మేకర్స్ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. ఫుల్ బిజీగా ఉన్న స్టార్స్ అంతా వీలైనంత త్వరగా సెట్‌లో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో డార్లింగ్ ప్రభాస్ కూడా చేరిపోయారు. మూడు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్…. ఎప్పుడెప్పుడు వర్క్ రెజ్యూమ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సౌత్‌లో కూడా షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో ఫస్ట్ సలార్ షూట్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట డార్లింగ్ ప్రభాస్. ఇప్పటికే కెప్టెన్ ప్రశాంత్ నీల్‌కు షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పేశారట.
సలార్ తో పాటు రాధేశ్యామ్ ప్యాచ్ వర్క్ కూడా ప్యారలల్‌గా ముగించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు డార్లింగ్ టీమ్. ఆదిపురుష్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ రావణుడి సీన్స్‌ను తెరెకెక్కిస్తున్నారు. షార్ట్ గ్యాప్ తరువాత ప్రభాస్ తో మరో షెడ్యూల్ ఉంటుంది. భారీ లైనప్ ఉండటంతో ఏ మాత్రం డిలే చేయకుండా సెట్‌లో అడుగుపెడుతున్నారు ప్రభాస్.
మరిన్ని ఇక్కడ చదవండి :