Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. కన్ఫామ్ చేసిన అతని లాయర్
బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కేరాఫ్ కాంట్రవర్శీనే. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరో లెవెల్. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అంతకుమించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ -7 సీజన్ క్లైమాక్స్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్ లైఫ్‌లో అభిమానులు హద్దులు దాటారు.

టీవీ9తో బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ రాజేష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. FIR కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్‌ను సంప్రదిస్తే .. కుటుంబ సభ్యులు రావాలి అని చెబుతున్నట్లు వివరించారు. FIR కాపీని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలిసిన బాధ్యత పొలిసులదని.. ఆ పని వారు చేయడం లేదన్నారు. FIR కాపీ లేకపోవడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందన్నారు.
బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కేరాఫ్ కాంట్రవర్శీనే. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరో లెవెల్. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అంతకుమించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ -7 సీజన్ క్లైమాక్స్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్ లైఫ్‌లో అభిమానులు హద్దులు దాటారు. ఫైనాలే రోజు అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు రచ్చ రచ్చ చేశారు.
105 రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్.. రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచాడు. ఇక్కడే రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్-అమర్‌దీప్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్‌దీప్ అభిమానులు.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్ నినాదాలు చేసుకున్నారు. ఇదికాస్త గొడవకు దారితీసింది. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ధ్వంసం వరకు వెళ్లింది.
అన్నపూర్ణ స్టూడియో సమీపంలో పార్టీసిపెంట్‌ల కార్లు, TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు. విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సుమోటోగా కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..