Paagal Movie Teaser: ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన విశ్వక్ సేన్ తాజాగా పాగల్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ చాలా రొమాంటిక్‌గాను, ఆవేశంగాను కనిపిస్తున్నాడు. ఎవడ్రా నా లవర్‌ని ఏడ్పించిందంటుూ చెప్పే డైలాగ్ అదిరిపోతుంది. టీజర్ మాత్రం ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ అందిస్తుందనే చెప్పాలి.
మ్యాజికల్ లవ్ స్టోరీగా పాగల్ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. యూట్యూబ్‌లో ఈ వీడియో రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.
ఒకేసారి ఐదు చిత్రాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన యశ్‌రాజ్ ఫిలిమ్స్.. ఏ ఏ చిత్రాలు ఎప్పుడెప్పుడంటే..