మొత్తానికి ‘సినిమా బిడ్డలం’ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తానికి వ్యూహాత్మకంగా తన టీమ్‌తో ‘మా’ నుంచి తప్పుకున్నారు. ప్రకాశ్ రాజ్ పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. ఇక రాజీనామా చేసిన సభ్యులు తమ మనసులోని ఆవేదనను ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. దీంతో మా వ్యవహారం మరింత వేడెక్కింది. ఇక మున్ముందు ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశమైంది.
ఇక మంచు విష్ణు యాక్షన్ ప్లాన్‌పై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఆయనకున్న ఆప్షన్స్ ఓసారి చూస్తే.. ప్రకాష్ ప్యానల్‌తో చర్చలు జరిపి విషయాన్ని సాఫీగా సర్దుమణిగేలా చెయ్యడం. మాట్లాడే ఉద్దేశం లేకపోయినా, మాట్లాడినా ఉపయోగం లేకపోయినా ఆయన ముందున్న ఆప్షన్ రాజీనామాలు ఆమోదించడమే. ప్రకాష్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లలో శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్ కీలక పదవుల్లో ఉండగా.. మరో 8మంది ఈసీ మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరి రాజీనామాలు ఆమోదిస్తే.. విష్ణుకు కొత్త వాళ్లను నియమించుకోవచ్చు. అయితే.. ప్రకాష్ ప్యానల్‌పై ఓడిపోయిన 11మందిని తన టీమ్‌లోకి తీసుకుని 100% మంచు ప్యానల్‌నే ఫామ్‌లోకి తెస్తారా? లేదంటే బయటి నుంచి ఇంకొందరు కొత్త వాళ్లను తెరపైకి తెస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
Also Read: ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్
మా’లో మరో సంచలనం… ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామా