నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..ఖుష్బూ సంచ‌ల‌న పోస్ట్…

|

Jun 15, 2020 | 4:02 PM

మ‌నుషుల్నిమాన‌సిక ఒత్తిడి వేధిస్తుంది. అది తీవ్రమైన‌ప్పుడు జ‌రిగే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స‌న్నిహితుల‌తో బాధ‌ను పంచుకుంటే వాటి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..ఖుష్బూ సంచ‌ల‌న పోస్ట్...
Follow us on

మ‌నుషుల్ని మాన‌సిక ఒత్తిడి వేధిస్తుంది. అది తీవ్రమైన‌ప్పుడు జ‌రిగే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స‌న్నిహితుల‌తో బాధ‌ను పంచుకుంటే వాటి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ఒంటరిగా ఉంటే మాత్రం ఒత్తిడి పెనుభూతంగా మారే ప్ర‌మాదం ఉంది. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అలాగే త‌న జీవితాన్ని ముగించారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్యపై ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ స్పందించారు. ఒత్తిడితో కూడిన స‌మ‌స్య‌లు, ప‌రిస్థితులు ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉంటాయ‌ని, వాటిని ఎదుర్కొవాల‌ని సూచించారు,

ఒక‌ప్పుడు తానుకూడా తీవ్ర‌మైన మానసిక ఒత్తిడిని అనుభ‌వించాన‌ని..జీవితాన్ని కూడా ముగించాలి అనుకున్న‌ట్లు తెలిపారు. కానీ వాటితో పోరాడి..త‌న‌ను నాశనం చేయాల‌నుకున్న స‌మ‌స్య‌ల కంటే తాను స్ట్రాంగ్ అని నిరూపించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. త‌న ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలి నిర్ణయించుకుని..విజ‌యం సాధించిన‌ట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆవిడ ట్విట్ట‌ర్ లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.