
చిన్మయి శ్రీపాద.. ఈపేరును పెద్దగా పరిచయం చేయలేసిన ఆవరసం లేదు. ఎన్నో అద్భుత పాటలు పాడి అలరించారు చిన్మయి. అలాగే స్టార్ హీరోయిన్స్ కు తన వాయిస్ ను దానం చేశారు చిన్మయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత కు చిన్మయి వాయిస్ ఇచ్చేవారు. ఈ ఇద్దరి కాంబో ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే చిన్మయి పాటలతో కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే చిన్మయి. సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు. మహిళల పై జరిగే అకృతయలపై తన గళం విప్పుతారు చిన్మయి. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పైన కూడా ఆమె పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ఈ క్రమంలోనే స్టార్ రైటర్ వైరముత్తు పై ఆమె సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి మధ్య గొడవ హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా తమిళ నటి అర్చన రచయిత వైరముత్తుని కలిసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్చన షూటింగ్ లో ఉండగా వైరముత్తు అక్కడికి వెళ్ళాడు. ఆయనను కలిసిన అర్చన.. కొన్ని ఫోటోలు దిగింది. ఈ ఫొటోలో అతడు ఆమె తల పై చేయి పెట్టి ఆశీర్వదించాడు. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అర్చన. ఆ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.
ఈ ఫోటోల పై చిన్మయి స్పందించింది. ఇది ఇలాగే మొదలవుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడితో తగినంత దూరంగా ఉండు.. నీతో ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మాత్రం అతడిని కలవొద్దు. అంటూ రాసుకొచ్చింది. మరి దీనిపై అర్చన, వైరముత్తు ఎలా స్పందిస్తారో చూడాలి.
Archana
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.