యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva)దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా కొరటాల శివ సినిమా పైనే దృష్టి పెట్టారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే జనతా గ్యారేజ్ లో తారక్ స్లిమ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు తారక్ కొరటాల శివ సినిమాలో ఎలా ఉండబోతున్నారన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇటీవల తారక్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సినిమాలో తారక్ మరోసారి స్లిమ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.
ఇటీవల ఆర్ఆర్ఆర్ కోసం కాస్త బరువు పెరిగిన తారక్ ఇప్పుడు కొరటాల శివ సినిమాకోసం మళ్లీ సన్నగా మారిపోయాడట. ఇక ఈ సినిమా మీసం, గడ్డం తో రఫ్ లుక్ లో కనిపించనున్నాడట తారక్. ఈ సినిమాకోసం కసరత్తులు చేస్తున్నాడు తారక్. అటు కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమా షూటింగు ఒకసారి మొదలైతే వీలైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే రెగ్యులర్ షూటింగును జులై 2వ వారం నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :