RRR : దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్(RRR). మార్చి 25న అంటే రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ళ పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన కూడా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. వీలైనన్ని ఇంటర్వ్యూలతో హంగామా చేస్తున్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్(Jr NTR)కొమురం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది. చరణ్, తారక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన పాట గురించి చెప్తూ ఆపాటను పాడారు. ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఆయన తన గాత్రం తోనూ అలరిస్తూ ఉంటారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన పాట ఏది అని యాంకర్ ప్రశ్నించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలోని ఆశ పాశం.. పాట’ అని చెప్పారు. ఫోన్‌లో ఈ పాట ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటానని అన్నారు తారక్. అంతే కాదు ఆ పాట పాడి వినిపించాడు తారక్. ఎన్టీఆర్ తన సినిమాలోని పాట పాడటంతో ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహ సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ ఫోన్ ప్లేలిస్ట్‌లో ఆశ పాశం.. సాంగ్ ఉండటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్, బెంగళూరు, వారణాసి, ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు చిత్రయూనిట్.
Glad to know that #AasaPaasam is the most played song on your phone. Thank you @tarak9999 garu… you made my day. Wish you a great success with #RRR pic.twitter.com/kACWnAEKXV
— Venkatesh Maha (@mahaisnotanoun) March 23, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :