AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : తారక్ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే సాంగ్ ఏంటో తెలుసా.. పాట పాడి వినిపించిన యంగ్ టైగర్

దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్. మార్చి 25న అంటే రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Jr NTR : తారక్ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే సాంగ్ ఏంటో తెలుసా.. పాట పాడి వినిపించిన యంగ్ టైగర్
Ntr
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2022 | 6:54 AM

Share

RRR : దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్(RRR). మార్చి 25న అంటే రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ళ పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన కూడా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. వీలైనన్ని ఇంటర్వ్యూలతో హంగామా చేస్తున్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్(Jr NTR)కొమురం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది. చరణ్, తారక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన పాట గురించి చెప్తూ ఆపాటను పాడారు. ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఆయన తన గాత్రం తోనూ అలరిస్తూ ఉంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన పాట ఏది అని యాంకర్ ప్రశ్నించగా.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రంలోని ఆశ పాశం.. పాట’ అని చెప్పారు. ఫోన్‌లో ఈ  పాట ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటానని అన్నారు తారక్. అంతే కాదు ఆ పాట పాడి వినిపించాడు తారక్. ఎన్టీఆర్ తన సినిమాలోని పాట పాడటంతో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహ సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ ఫోన్‌ ప్లేలిస్ట్‌లో ఆశ పాశం.. సాంగ్‌ ఉండటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్‌ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు వెంకటేష్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్‌ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దుబాయ్, బెంగళూరు, వారణాసి, ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ
28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ