Salman Khan: సల్మాన్ మాత్రమే కాదు.. లారెన్స్ బిష్ణోయ్ లిస్ట్‏లో ఈ సెలబ్రెటీస్ పేర్లు..

|

Oct 19, 2024 | 5:51 PM

బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు దేశం మొత్తం ఇదే పేరు వినిపిస్తోంది. ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ వర్గం టార్గెట్ సల్మాన్ ఖాన్ కావడంతో అతడికి మరింత భద్రత ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. ఈ క్రమంలోనే సల్మాన్ దుబాయ్ నుంచి రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Salman Khan: సల్మాన్ మాత్రమే కాదు.. లారెన్స్ బిష్ణోయ్ లిస్ట్‏లో ఈ సెలబ్రెటీస్ పేర్లు..
Bishnoi, Salman Khan
Follow us on

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతుంది. ఇప్పటికే ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. బీటౌన్ హీరో సల్మాన్ ఖాన్‏తోపాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. అందుకే బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ వ్యక్తిగత రక్షణతోపాటు అతడి ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఇప్పటికే సల్మాన్ భద్రత కోసం 2 కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశాడు. మరోవైపు బిష్ణోయ్ గ్యాంగ్ తమ అభిమాన హీరోను టార్గెట్ చేసి చంపేస్తామని బెదిరిస్తుండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ కేవలం సల్మాన్ మాత్రమే కాదు.. అతడి లిస్టులో ఇంకా చాలా మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నట్లు పోలీసులు అధికారులు భావిస్తున్నారు. లారెన్స్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. లారెన్స్ క్రిమినల్ నెట్‌వర్క్‌లో 700 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్వాలా హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అలాగే బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. 26 ఏళ్ల క్రితం కృష్ణజింకలను వేటాడడం వల్లే సల్మాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిందని తెలుస్తోంది. ఎందుకంటే బిష్ణోయ్ గ్యాంగ్ కృష్ణజింకను దేవుడిగా భావించి పూజిస్తారు.

సల్మాన్ తర్వాత బిష్ణోయ్ లిస్టులో బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాబా సిద్ధిఖీని కాల్చిచంపిన నిందితులు ధరమ్‌రాజ్ కశ్యప్, గుర్‌మైల్ సింగ్‌లు తాము అక్టోబర్ 12న జీషన్‌ను చంపేందుకు వచ్చామని, బదులుగా అతని తండ్రిని కాల్చిచంపామని పోలీసుల ఎదుట అంగీకరించారు.

పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా మేనేజర్ షాగన్‌ప్రీత్ కూడా లారెన్స్ బిష్ణోయ్ రాడార్‌లో ఉన్నారు. షగన్‌ప్రీత్‌ను టార్గెట్ చేయడానికి కారణం ఏమిటంటే, 2021లో మొహాలీలో తన సన్నిహితుడైన విక్కీ మిద్దుఖేడాను చంపిన వ్యక్తికి షగన్‌ప్రీత్ ఆశ్రయం ఇచ్చాడని లారెన్స్ భావిస్తున్నాడు.

లారెన్స్ బిష్ణోయ్ రాడార్‌లో బిగ్ బాస్ విన్నర్ మునవర్ ఫారూఖీ కూడా ఉన్నారు. ఢిల్లీలో మునవ్వర్‌పై దాడికి పథకం పన్నారు. అయితే, సకాలంలో పోలీసులు మునవ్వర్‌ను రక్షించి ముంబైకి పంపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో లారెన్స్ భీభత్సం కనిపిస్తోంది.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.