పాటకు రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్రేజీ బ్యూటీ! నెట్‌వర్త్ తెలిస్తే అమ్మో అనాల్సిందే

ఆమె కేవలం తన డ్యాన్స్‌తోనే భారతీయ సినీ పరిశ్రమను ఉర్రూతలూగించింది. కెనడా నుంచి కేవలం రూ. 5000తో భారత్‌కు వచ్చి, ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ భామ, ఇప్పుడు ఒక్కో స్పెషల్ సాంగ్ ..

పాటకు రూ.60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్రేజీ బ్యూటీ! నెట్‌వర్త్ తెలిస్తే అమ్మో అనాల్సిందే
Item Bomb

Updated on: Dec 24, 2025 | 7:00 AM

ఆమె కేవలం తన డ్యాన్స్‌తోనే భారతీయ సినీ పరిశ్రమను ఉర్రూతలూగించింది. కెనడా నుంచి కేవలం రూ. 5000తో భారత్‌కు వచ్చి, ఇప్పుడు కోట్లలో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ భామ, ఇప్పుడు ఒక్కో స్పెషల్ సాంగ్ కోసం డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఈమె ఉండాల్సిందే అన్నంతగా తన క్రేజ్‌ను పెంచుకుంది. అత్యంత తక్కువ కాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తిని కూడబెట్టిన ఆ గ్లామర్ బ్యూటీ సంపాదన వివరాలు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఒక్కో స్పెషల్ సాంగ్‌లో నటించడానికి దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు వసూలు చేస్తోంది ఈ హాట్​ బ్యూటీ. కేవలం సినిమాలే కాకుండా, ప్రముఖ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తోంది. ఒక్కో షో కోసం ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా లక్షల్లోనే ఉంటుంది. వీటితో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఈమెకు భారీ ఆదాయం వస్తోంది. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ఆమె రూ. 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట.

Nora Fatehi1.

అత్యంత ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లు ఈమె సొంతం. ముంబైలో ఆమెకు కోట్లాది రూపాయల విలువైన ఒక అపార్ట్‌మెంట్ ఉంది. అలాగే వానిటీ వ్యాన్ నుంచి ఆమె వాడే హ్యాండ్ బ్యాగుల వరకు అన్నీ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందినవే. కష్టపడి పైకొచ్చిన ఈ భామ, తన సంపాదనను రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడిగా పెడుతోంది.

ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆ డ్యాన్సింగ్ సెన్సేషన్ మరెవరో కాదు.. నోరా ఫతేహి! అవును, తన బెల్లీ డ్యాన్స్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న నోరా, ప్రస్తుతం సుమారు రూ. 52 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, నేడు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా ఎదగడం నిజంగా విశేషం. నోరా ఫతేహి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రతిభ ఉంటే భాషా భేదం లేకుండా ఏ దేశంలోనైనా సత్తా చాటవచ్చని ఆమె నిరూపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా పలు భారీ చిత్రాల్లో ఆమె సందడి చేయబోతోంది.