Nora Fatehi: అమ్మబాబోయ్.. నోరా ఫతేహి ఆడిషన్ చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

నోరా తన డ్యాన్స్‌లతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. కానీ ఓ సాధారణ అమ్మాయి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటిగా మారిన నోరాకు చాలా కష్టపడి నిలదొక్కుకుంది. విజ‌యాల‌తో కొన‌సాగుతున్న స‌మ‌యంలో నోరా ఎన్నో పరాజయాలు ఎదుర్కొంది. కాగా, నోరా పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో నోరా ఫతేహి మొదటి ఆడిషన్ కు సంబంధించిన వీడియో ఇది.

Nora Fatehi: అమ్మబాబోయ్.. నోరా ఫతేహి ఆడిషన్ చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
Nora Fatehi

Updated on: Dec 26, 2023 | 8:02 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో తనదైన టాలెంట్ తో నోరా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నోరా తన డ్యాన్స్‌లతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. కానీ ఓ సాధారణ అమ్మాయి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటిగా మారిన నోరాకు చాలా కష్టపడి నిలదొక్కుకుంది. విజ‌యాల‌తో కొన‌సాగుతున్న స‌మ‌యంలో నోరా ఎన్నో పరాజయాలు ఎదుర్కొంది. కాగా, నోరా పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో నోరా ఫతేహి మొదటి ఆడిషన్ కు సంబంధించిన వీడియో ఇది. హిందీలో ‘బిగ్ బాస్ 9’లో కంటెస్టెంట్‌గా నోరా ఫతేహి పాల్గొంది.

మొదటి ఆడిషన్‌ను ఎవరూ మరచిపోలేరు. కానీ ‘దిల్బర్’ పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత నోరా పాపులారిటీ, ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పేరు తెచ్చుకున్న తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న నోరా వీడియోలో నటి ప్లకార్డు పట్టుకుని కనిపించింది. దానిపై తన ఎత్తు, పేరు, వయస్సు ఇతర విషయాలు చూపించింది. ఇంతకు ముందు నోరా తన పేరును నౌరా ఫాతి అని రాసేది. అయితే ఇప్పుడు నటి తన పేరు స్పెల్లింగ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు నటి తన పేరును నోరా ఫతేహి అని మార్చుకుంది. నిజానికి నోరా 2014లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ ద సుందర్బన్స్’ సినిమాతో బాలీవుడ్ జర్నీ ప్రారంభించింది. ఒక సంవత్సరం తరువాత, నోరా ‘బిగ్ బాస్ 9’ లో కనిపించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. అలాగే ‘టెంపర్’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘కిక్ 2’ వంటి చిత్రాలలో హిట్ పాటల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది.

‘నాచ్ మేరీ రాణి’, ‘గార్మి’ వంటి పాటలు నోరాను లైమ్‌లైట్‌లో నిలిపాయి. నోరా డ్యాన్స్ మూవ్‌లకు అభిమానులు ఎప్పుడూ ఫిదా అవుతూ ఉంటారు. నోరాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. నోరా ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫోటోలు ,వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ ఫోటోలకు నోరా పెట్టింది పేరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.