Nithya Menon : ఆ హీరో ఇష్యూ మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టింది.. చాలా బాధ పడ్డాను.. నిత్యా మీనన్ కామెంట్స్..

నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం మలయాళం, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఓ ఇష్యూ కారణంగా తాను మానసికంగా బాధపడ్డానని చెప్పుకొచ్చింది.

Nithya Menon : ఆ హీరో ఇష్యూ మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టింది.. చాలా బాధ పడ్డాను.. నిత్యా మీనన్ కామెంట్స్..
Nithya Menon

Updated on: May 14, 2026 | 5:34 PM

నిత్యా మీనన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జనతా గ్యారేజ్’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఓ హీరో ఇష్యూ కారణంగా తాను చాలా బాధపడ్డానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

నిత్యా మీనన్ కెరీర్ ఆరంభంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “ప్రభాస్ ఎవరు?” అని అడగడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ, ఆ సమయంలో తాను చాలా అమాయకంగా ఉండేదాన్నని, కేవలం ఆ ఒక్క మాటను పట్టుకుని తనను చాలా ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆ విషయాన్ని పెద్దది చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ సంఘటన తర్వాతే అందరి దగ్గర నిజాయితీగా ఉండకూడదని, కొన్నిసార్లు ‘డిప్లొమాటిక్’గా వ్యవహరించడం అవసరమని తాను నేర్చుకున్నానని నిత్య చెప్పారు. “ప్రతి ఒక్కరూ నా నిజాయితీకి అర్హులు కారు” అని ఆ ఇష్యూ ద్వారా తనకు అర్థమైందని, ఆ తర్వాతే తాను లోకజ్ఞానాన్ని పెంచుకున్నానని వివరించారు. ప్రభాస్ ఇష్యూ కారణంగా తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

అలాగే తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ.. దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో కొన్ని ఫేక్ ఫోటోలు సృష్టించి తనను మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. కొన్ని ఘటనలు తన జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పిందని, అప్పటి నుండి తాను మనుషులను అంచనా వేయడంలో చాలా మారానని నిత్యా మీనన్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Nithya Menon, Prabhas

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us