AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో..

అలామొదలైంది సినిమాతో తెలుగులో జర్నీ మొదలు పెట్టిన బ్యూటీ నిత్యామీనన్. అందంతోపాటు అద్భుతమైన టాలెంట్ కూడా ఈ అమ్మడి సొంతం.

Nithya Menen: లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ హీరోయిన్.. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో..
Nitya
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2021 | 9:39 PM

Share

Nithya Menen: అలామొదలైంది సినిమాతో తెలుగులో జర్నీ మొదలు పెట్టిన బ్యూటీ నిత్యామీనన్. అందంతోపాటు అద్భుతమైన టాలెంట్ కూడా ఈ అమ్మడి సొంతం. పాత్ర ఏదైనా అందులో ఎంతో ఇష్టంగా ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. కేవలం నటిగానే కాకుండా సింగర్ గాను తన ప్రతిభను చాటుకుంది ఈ చిన్నది.అలా మొదలైంది సినిమా తర్వాత తెలుగులో పలు విజయవంతమైన సినిమాలో నటించింది నిత్యా అలాగే తమిళ్ లోను నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య నిత్యా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉండే నిత్యా ఈ మధ్య మరింత బరువు పెరిగింది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయని టాక్ నడించింది. ఆతర్వాత నిత్యా తిరిగి సన్నగా నాజూకుగా తయారయ్యింది. చివరిగా యంగ్ టైగర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కనిపించింది నిత్యా. ఇప్పుడు ఓ  స్టార్ హీరో సినిమాలో నిత్యా నటిస్తుందని తెలుస్తుంది.

ఆ స్టార్ హీరో ఎవరోకాదు పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో నిత్యామీనన్ కు అవకాశం దక్కిందని తెలుస్తుంది. పవర్ స్టార్ హీరోగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా కు తెలుగులో సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే  40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో పవన్ తోపాటు దగ్గుబాటి హీరో రానా నటిస్తున్నాడు. పవన్ కు భార్య పాత్రలో నిత్యా నటిస్తుండగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rajesh: నమ్మిన వ్యక్తే నన్ను మోసం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

Actress Saranya: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు

Taapsee Pannu: తెలుగులో చాలా కాలం తర్వాత తిరిగి సినిమా చేస్తున్న బ్యూటీ..

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..