AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: ఓ పేద రైతు కష్టాన్ని బూడిద పాలు చేసిన పిల్లి.. లక్ష రూపాయలు దగ్ధం.. విలపిస్తున్న రైతు కుటుంబం

Fire Accident: జోగుళాంబ గద్వాల జిల్లా లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద రైతు కష్టం అగ్ని పాలైంది. సుమారు లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. దీంతో పేద కుటుంబం కన్నీరు..

Fire Accident:  ఓ పేద రైతు కష్టాన్ని బూడిద పాలు చేసిన పిల్లి.. లక్ష రూపాయలు దగ్ధం.. విలపిస్తున్న రైతు కుటుంబం
Fire Accident
Surya Kala
|

Updated on: Jul 06, 2021 | 9:20 PM

Share

Fire Accident: జోగుళాంబ గద్వాల జిల్లా లో దారుణ ఘటన జరిగింది. ఓ పేద రైతు కష్టం అగ్ని పాలైంది. సుమారు లక్ష రూపాయలు నిప్పంటుకుని కాలిపోయాయి. దీంతో పేద కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్ నుంచి అంతకు ముందే తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టినల్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కేటీ దొడ్డి మండలం నందిన్నెకు చెందిన రైతు వీరేష్‌ తనపొలంలో వరి పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో.. ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. దీనికి సంబంధించి ఈ నెల 1న బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. శనివారం డబ్బు లు బ్యాంక్ నుంచి తీసుకుని చేతి సంచిలో పెట్టి.. చుట్ట చుట్టి.. ఇంట్లో భద్రపరిచాడు.

సోమవారం ఉదయం ఎప్పటిలా దేవుడి పటాల ముందు పూజ చేసి హారతి ఇచ్చాడు. అయితే కొంత సేపటికి ఆ గుడిసెలోకి వచ్చిన ఓ పిల్లి.. ఇంట్లో తిరుగుతూ.. దేవుడికి ఇచ్చిన హారతి తగిలింది. ఆ హారతి తగలడంతో.. గుడిసెకు మంటలు వ్యాపించాయి.

దీంతో వీరేష్ తో పాటు ఇరుగుపొరుగు ఆ మంటలను ఆర్పేశారు. అప్పటికే రైతు దాచుకున్న లక్ష రూపాయలకు నిప్పు అంటుకుని దగ్ధం అయ్యాయి. దీంతో వీరేష్ కన్నీరు పెట్టుకున్నాడు.. పంట సాగు కోసం తీసుకుని వచ్చిన అప్పు రూ. 50 వేలను తీరుద్దామని అనుకున్నాను.. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ విలపించాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. గ్రామస్థులు ఈ నోట్లకు ఆర్బీఐ ఏమైనా రీప్లేస్ చేసేవీలుంటే బాగుండును అని అంటున్నారు.

Also Read: ఘనంగా జరిగిన నటి శరణ్య పెద్దకూతురు ప్రియదర్శిని రిసెప్షన్ వేడుక .. హాజరైన సీఎం స్టాలిన్ దంపతులు

Follow Us
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'