టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో నిత్యామీనన్ ఒకరు (Nithya Menen). అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది… ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ మనసు దొచుకుంది. అందం, అభినయం, చలాకీతనంతో పరిశ్రమలో మెప్పించిన ఈ చిన్నది.. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవలే స్కైలాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరనస తిరుచిత్రంబలం మూవీలో నటించింది. తాజాగా తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది నిత్యా. ఆమెకు పొగరు ఎక్కువ అని.. సెట్ లో ఎవరితో మాట్లాడదని.. ఎదుటివారికి పొగరుగా సమాధానమిస్తుందంటూ వస్తున్న వార్తలపై తనస్టైల్లో చెక్ పెట్టింది నిత్యా.
“నాకు పొగరు ఎక్కువ అని ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటారు. అందుకే నాగు పొగరు అనే పేరు ఉంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సినీ పరిశ్రమలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. వారికి నచ్చినట్లు చేయకపోయేసరికి నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మన ఎదుగుదలను చూడలేని వారు.. ఎలాగైన మనల్ని కిందకు లాగడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటివరకు నాతో నటించినవారెవ్వరు నాతో పనిచేయడం కష్టమని చెప్పలేదు. కానీ నేను ఎదుగుతున్న సమయంలో నాపై అనేక నిందలు.. నాగురించి అవాస్తవాలు చెబుతూ నన్ను కిందకు దించాలని చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది నిత్యా. ఇక ఇటీవల ఈ మలయాళ కుట్టి మ్యారెజ్ విషయంలో పలు రకాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.