మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్ రంగ్ దే… అదే రోజు విడుదలకానున్న ‘కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’

గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో..

మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్ రంగ్ దే...  అదే రోజు విడుదలకానున్న 'కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2021 | 5:28 AM

Nithin Rang De Movie : గత ఏడాది ‘భీష్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ హీరో నితిన్. ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అని సినిమా చేస్తున్నాడు నితిన్. అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేయాలిసింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కాగా హాలీవుడ్ మూవీ ‘కాంగ్ వర్సెస్ గాడ్జీలా’ సినిమాని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నితిన్ రంగ్ దే ఒకేరోజు పోటీపడుతుండటంతో మల్టీప్లేక్స్ లపై ఓపెనింగ్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఉప్పెన లో ‘రాయనం’పాత్రకు విజయ్ సేతుపతి అందుకే డబ్బింగ్ చెప్పలేదట.. అసలు విషయం చెప్పిన దర్శకుడు