ఉప్పెన లో ‘రాయనం’పాత్రకు విజయ్ సేతుపతి అందుకే డబ్బింగ్ చెప్పలేదట.. అసలు విషయం చెప్పిన దర్శకుడు

'ఉప్పెన' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఇది . కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి..

ఉప్పెన లో 'రాయనం'పాత్రకు విజయ్ సేతుపతి అందుకే డబ్బింగ్ చెప్పలేదట.. అసలు విషయం చెప్పిన దర్శకుడు
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2021 | 12:40 AM

Uppena Movie : ‘ఉప్పెన’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఇది . కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. సుకుమార్ రైటింగ్స్ ద్వారా విడుదల కానుంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

అయితే విజయ్ సేతుపతిఅవ్వడానికి తమిళ్ హీరో అయినా తెలుగులోనూ చక్కగా మాట్లాడుతారు. మొదటి సినిమా సైరా సినిమాలో సేతుపతి సొంతంగా డబ్బింగ్ చెప్పారు. అయితే ఉప్పెన సినిమాకు మాత్రం అయన డబ్బింగ్ చెప్పలేదు. ఈ మూవీలో విజయ్ సేతుపతి వాయిస్ కు నటుడు బొమ్మాలి రవి శంకర్‌తో డబ్బింగ్‌ చెప్పించారు. ట్రైలర్‌ విడుదలైన తర్వాత విజయ్‌ సేతుపతి డబ్బింగ్‌ వాయిస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ విషయం పై దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ రాయనం పాత్రకు తన వాయిస్‌ సెట్‌ అవ్వదని విజయ్‌ సేతుపతి గారు చెప్పారు. గతంలో ఆయనకు డబ్బింగ్‌ చెప్పిన నటుడు అజయ్‌, మరికొంతమందితో డబ్బింగ్‌ చెప్పిద్దామని అనుకున్నాం. చివరకు బొమ్మాలి రవి శంకర్‌ను ఫైనల్‌ చేశాం. మామూలుగా ఆయన ఒక రోజులోనే పాత్రలకు డబ్బింగ్‌ చెబుతారు. అలాంటిది రాయన్న పాత్రకు డబ్బింగ్‌ చెప్పటానికి మూడు రోజులు టైం తీసుకున్నారు’’ అని తెలిపాడు బుచ్చిబాబు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kanchana : ప్రముఖ నటి దానం చేసిన స్థలంలో ఆలయం.. త్వరలోనే భూమి పూజ కార్యక్రమం..