Macherla Niyojakavargam: నితిన్ నయా మూవీ రిలీజ్ డేట్ లాక్.. ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్(Nithiin) హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న మూవీ 'మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam).

Macherla Niyojakavargam: నితిన్ నయా మూవీ రిలీజ్ డేట్ లాక్.. మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Macherla Niyojakavargam

Updated on: Jun 24, 2022 | 5:15 PM

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్(Nithiin) హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తోన్న మూవీ ‘మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam).ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాచర్ల నియోజకవర్గం రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కూడా పూర్తయింది.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది చిత్ర యూనిట్. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో నితిన్, కృతి శెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నితిన్, కృతిశెట్టి జోడి చాలా బ్యూటీఫుల్ అండ్ రెఫ్రెషింగ్ గా వుంది. స్టిల్ లో కనిపిస్తున్న ఈ పాటని యూరప్ లొకేషన్ లో చిత్రీకరించారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.